విజయనగరం జిల్లాలో మెంటాడ మండలం కుంటినవలస జెడ్పీ హై స్కూల్ హెడ్ మాస్టర్ ముగడ రామకృష్ణారావు, అదే పాఠశాలలో పని చేస్తున్న ఇంగ్లీషు ఉపాధ్యాయుడిని కొట్టిన ఘటన కలకలం రేపుతోంది. రామకృష్ణారావు మద్యం సేవించి తరచూ పాఠశాలకు రావడం.. పాఠశాల ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని విద్యా కమిటీ చైర్మన్ పెదిరెడ్ల సత్యనారాయణ డిప్యూటీ డీఈవో మోహనరావుకు ఫిర్యాదు చేశారు.