కార్తికేయ… ‘ఆర్.ఎక్స్.100’ మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన హీరో. దానికి ముందు ‘ప్రేమతో మీ కార్తీక్’ మూవీలో హీరోగా నటించినా, గుర్తింపు మాత్రం ‘ఆర్. ఎక్స్. 100’తోనే వచ్చింది. ఆ గ్రాండ్ సక్సెస్ కారణంగా కార్తికేయ గత మూడేళ్లుగా వెనుదిరిగి చూసుకోకుండా సినిమాలు చేస్తూ వచ్చాడు. అతనిలోని ఎనర్జీ లెవెల్స్ చూసి యూత్ ఫుల్ లవ్ స్టోరీలు తీయాలనుకున్న దర్శకులు, యాక్షన్ డ్రామాలు చేయాలనుకున్న నిర్మాతలు క్యూ కట్టారు. అలా వచ్చిన ‘హిప్పీ’, ‘గుణ 369′,…