పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ నగరం మళ్లీ వార్తల్లో నిలిచింది. ఈసారి ముర్షిదాబాద్‌లో వక్ఫ్ చట్టం పేరుతో భారీ హింస జరిగింది. ఆందోళనకారులు రైళ్లను నిలిపివేశారు. పోలీసులపై రాళ్లు రువ్వారు. ముర్షిదాబాద్ నుంచి 10 కి.మీ దూరంలో ఉన్న షంషేర్‌గంజ్ కూడా హింసతో అట్టుడుకుతోంది. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్న కొంత మంది హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేశారు. హింస తర్వాత.. ఓ జాతీయ మీడియా బాధిత హిందూ కుటుంబాల వద్దకు చేరుకుంది.…
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఔరంగజేబు సమాధిని కూల్చివేస్తామని, సముద్రంలో పడేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ హిందువులు అవసరమైతే మహారాష్ట్ర హిందువులకు మద్దతుగా వెళతారని పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ మోడీ మేనిఫెస్టోలో దేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చే ప్రకటన ఉండాలని కోరారు. వచ్చే ఎన్నికలు కాశి, మథుర, హిందూ రాష్ట్ర భవిష్యత్తుపై ఆధారపడతాయని అభిప్రాయపడ్డారు.