Navneet Rana: దేశ జనాభా కూర్పు, పాకిస్తాన్‌లా మారకుండా ఉండాలంటే ప్రతీ హిందువు నలుగురు పిల్లల్ని కనాలని ఒకప్పటి టాలీవుడ్ సినీనటి, బీజేపీ నేత నవనీత్ రాణా పిలుపునిచ్చారు. ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. కొంత మందికి అనేక మంది భార్యలు, చాలా మంది పిల్లలు ఉన్నారని, వారి జనాభా పెరుగుతూనే ఉందని, దానిని ఎదుర్కొవడానికి, హిందుస్థాన్‌ను రక్షించడానికి హిందువులు కనీసం ముగ్గురు నుంచి నలుగురు పిల్లల్ని కనాలని ఆమె పిలుపునిచ్చారు.
West Bengal: పశ్చిమ బెంగాల్‌లో బాబ్రీ మసీదును నిర్మిస్తామని చెబుతూ, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ వార్తల్లో వ్యక్తిగా మారారు. బాబ్రీ వివాదం కారణంగా, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కబీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. వచ్చే ఏడాది బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో హుమాయున్ కబీర్ సొంతగా ‘‘జనతా ఉన్నయన్ పార్టీ’’ని స్థాపించాడు. అయితే, ఇప్పుడు ఆయన మరో వివాదంలో ఇరుక్కున్నాడు. ఎన్నికల్లో తన పార్టీ తరుపున తాత్కాలిక అభ్యర్థుల జాబితా…