హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీలకు అతీతంగా నాయకుల రాజకీయ భవితవ్యాన్ని ఓటర్లు నిర్ణయించే రోజు వచ్చేసింది. నేడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది.
హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. సిమ్లాలోని రాంపూర్‌లో ఓటేసిన అనంతరం కాంగ్రెస్ ఎంపీ, రాష్ట్ర చీఫ్ ప్రతిభా సింగ్ మాట్లాడారు. తన పార్టీ 40-45 సీట్లు గెలుస్తుందని, ఈ సారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని కాంగ్రెస్ మాత్రమే సవాలు చేయగలదని, ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం ఢిల్లీకి చెందిన పార్టీ మాత్రమేనని కాంగ్రెస్ మాజీ నాయకుడు గులాం నబీ ఆజాద్ ఆదివారం అన్నారు.
ఎన్నికల నేపథ్యంలో హిమాచల్‌లో బీజేపీ ఎన్నికల ప్రచారంలోకి అడుగుపెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ శనివారం కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ కేవలం దేశ భద్రతకు విరుద్ధమే కాదు.. దేశాభివృద్ధికి కూడా వ్యతిరేకమని విమర్శలు గుప్పించారు.
Himachal Pradesh polls: ప్రస్తుతం తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు కూడా బద్ధకిస్తున్న అక్షరాస్యులున్నారు. అలాంటిది 106ఏళ్ల వయసులో కూడా ఓటేసి తనకు సమాజం పట్ల ఉన్న బాధ్యతను తెలియజేస్తున్నారు శ్యామ్ శరణ్ నేగి.
కాంగ్రెస్ మాజీ నేత విజయ్ సింగ్ మంకోటియా మంగళవారం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లో చేరారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమల తీర్థం పుచ్చుకున్నారు.