BJP Retains Gujarat, Himachal: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో మళ్లీ బీజేపీని తిరుగులేని స్థానంలో నిలబెట్టారు అక్కడి ప్రజలు. మళ్లీ అధికారం బీజేపీ కైవసం చేసుకుంటుందని ఎగ్జిట్ పోల్స్ సూచిస్తున్నాయి. మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్ అసెంబ్లీలో 100కు పైగా స్థానాలు గెలుస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తున్నాయి. ఇక హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కూడా బీజేపీనే గెలుస్తుందని అన్ని ఎగ్జిట్ పోల్స్ అంచానా వేస్తున్నాయి.