నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ వన్ పోలీస్ స్టేషన్ రణరంగంగా మారింది. పోలీస్ స్టేషన్‌లోనే హిజ్రాలు రెచ్చిపోయి.. పొట్టుపొట్టుగా కొట్టుకున్నారు. రెండు గ్రూప్‌లుగా విడిపోయి తీవ్రంగా దారుణంగా ఒకరిని ఒకరు కొట్టుకున్నారు. ఆధిపత్య పోరులో భాగంగా ఓ వర్గం హిజ్రాలు పోలీసులను ఆశ్రయించగా.. దీంతో ఈ విషయం తెలుసుకున్న మరో వర్గం పీఎస్ కు వచ్చింది. రెండు వర్గాలు ఎదురెదురు పడటంతో పోలీస్ స్టేషన్ లోనే తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది.