కేంద్ర మంత్రి గడ్కరీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమావేశమయ్యారు. వచ్చే వారం ప్రధాన మంత్రితో సమావేశం అవనున్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న జాతీయ రహదారుల మంజూరీపై గడ్కరీతో సుదీర్ఘంగా సమావేశమై చర్చించారు. మంత్రితోపాటు హాజరైన తెలంగాణ ఎంపీలు పాల్గొన్నారు. మల్కాపూర్ నుంచి విజయవాడ (అమరావతి) వరకు రహదారిని 4 వరుసల నుంచి 6 వరుసలు గా విస్తరించడంతో పాటు సర్వీస్ రోడ్లను నిర్మించాలని గడ్కరీని కోరారు. పలు రోడ్లు, భవనాలపై చర్చించారు.
Kishan Reddy : కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల అభివృద్ధి కోసం లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు , కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత 10 సంవత్సరాలలో జాతీయ రహదారుల నిర్మాణం వేగంగా సాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. అలాగే, అన్ని రాష్ట్రాల రాజధానులను జాతీయ రహదారులతో అనుసంధానం చేయడానికి కేంద్రం కృషి చేస్తున్నది. ఈ నిర్మాణం వెనుక ఉన్న ముఖ్యమైన అంశం తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ. 2014 వరకు రాష్ట్రంలో…