ఢిల్లీ అగ్నిగుండంగా మారింది. ఎన్నడూ లేనంత రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలో ఈరోజు 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా.. భారతదేశంలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా ఉష్ణోగ్రత నమోదైంది. ఢిల్లీలోని ముంగేష్‌పూర్‌లోని వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యాహ్నం 2.30 గంటలకు 52.3 డిగ్రీల సెల్సియస్ నమోదైనట్లు పేర్కొంది. ఇదిలా ఉంటే.. రికార్డ్ ఉష్ణోగ్రత నమోదైన అనంతరం తాజాగా ఢిల్లీలో పలు చోట్ల వర్షం కురుస్తుంది.