High Tension In Gollapudi: ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. గొల్లపూడిలోని వివాదస్పద స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉందన్న ఆరోపణల నేపథ్యంలో.. అక్కడి నుంచి టీడీపీ కార్యాలయ తరలింపు పనులు ప్రారంభించారు పోలీసులు.. కార్యాలయం దగ్గర ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించారు.. కార్యాలయంలోని కంప్యూటర్లును కూడా తరలించారు పోలీసులు.. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా.. టీడీపీ కార్యాలయంతో పాటు.. గొల్లపూడిలోని పలు ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు..…