అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణ మూలాలు ఉన్న కుర్రాడు కూడా ఇపుడు ప్రతిష్ఠాత్మకమైన ‘అమెరికా ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్-2023’కు ఎంపికయ్యాడు. వర్జీనియాలోని ఫెయిర్‌ఫాక్స్‌లో హైస్కూల్ సీనియర్స్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న తేజ కోడూరు 2023 ఏడాదికి గాను ‘ప్రెసిడెన్షియల్ స్కాలర్‌షిప్’కు ఎంపికైనట్టు అమెరికా విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.