Packaged drinking water: ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్యాకేజ్డ్ డ్రింకింగ్, మినరల్ వాటర్‌ను ‘‘హై రిస్క్ ఫుడ్ కేటగిరీ’’లో చేర్చింది. ఇలా వర్గీకరించడం వల్ల ఈ ఉత్పత్తులను తప్పని సరిగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తుల కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) నుంచి ధ్రువీకరణ అవసరాన్ని తొలగించాలని ప్రభుత్వం అక్టోబర్‌లో నిర్ణయించింది.