Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట కారు బ్లాస్ట్ కేసులో విచారణ ముమ్మరమైంది. ఈ కేసును ఇప్పటికే జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) చేతిలోకి తీసుకుంది. పలువురు డాక్టర్ ఉగ్రవాదులతో పాటు మరికొందరిని అధికారులు అరెస్ట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ఈ బాంబులో ఏ పదార్థం వాడారో తెలుసుకునేందుకు నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ లాబోరేటరీ బృందం పరీక్షిస్తోంది. ముందుగా, ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్ మాత్రమే వాడినట్లు ప్రాథమికంగా అనుకున్నారు. అయితే, ఇదే కాకుండా హైగ్రేడ్ పేలుడు పదార్థాలు…