తెలంగాణలో భారీ చిత్రాల విడుదల సమయంలో సినిమా టికెట్ల ధరల పెంపు వ్యవహారం మరోసారి రచ్చకెక్కింది. ప్రభాస్ నటించిన ‘రాజాసాబ్’ చిత్రానికి సంబంధించి టికెట్ రేట్ల పెంపును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు, ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబట్టింది. పదే పదే టికెట్ ధరలను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నిస్తూ, న్యాయస్థానం ఆదేశాలను బేఖాతరు చేయడంపై అసహనం వ్యక్తం చేసింది. Geetha Madhuri: గీతా మాధురి క్యాసినోలో ఎంత పోగొట్టిందంటే..! సినిమా టికెట్ల ధరలను…
తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ (డీజీపీ) నియామకానికి సంబంధించి గత కొంతకాలంగా కొనసాగుతున్న న్యాయపరమైన సందిగ్ధతకు హైకోర్టు తీర్పుతో ఒక కీలక మలుపు లభించింది. ప్రస్తుత డీజీపీ నియామక ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం, రాష్ట్ర ప్రభుత్వానికి ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. డీజీపీ నియామక ఉత్తర్వులను కొట్టివేసేందుకు న్యాయస్థానం నిరాకరించడమే కాకుండా, ఈ ప్రక్రియలో తక్షణమే జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. దీనివల్ల ప్రస్తుత డీజీపీ బాధ్యతల్లో కొనసాగడానికి…
తెలంగాణలో బలహీన వర్గాల (BC) కోసం 42% రిజర్వేషన్ల జారీపై హైకోర్టులో జరుగుతున్న విచారణ సోమవారం వరకు వాయిదా పడింది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా రాబోయే నియామకాల నేపథ్యంలో హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిశీలిస్తోంది.
దుబాయ్‌లో పాఠశాల విద్య, హైదరాబాద్‌లో ఇంటర్మీడియట్ విద్యను పూర్తి చేసిన విద్యార్థిని ఎంబీబీఎస్ అడ్మిషన్లకు స్థానిక అభ్యర్థిగా గుర్తించాలని తెలంగాణ హైకోర్టు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ను ఆదేశించింది. కొండాపూర్‌కు చెందిన అనుమత ఫరూక్ పిటిషన్‌ను విచారించిన అనంతరం చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ శ్రీనివాస్‌రావుతో కూడిన డివిజన్ బెంచ్ ఈ తీర్పును వెలువరించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్లలో స్థానిక అభ్యర్థిగా పరిగణించకుండా తప్పించడాన్ని ఫరూక్ సవాలు చేశారు. ఫరూక్ 1998 నుంచి…