Camera Found in MRI Centre: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని మాల్వియా నగర్‌లో ఉన్న ఓ ఎంఆర్‌ఐ సెంటర్‌లో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో మొబైల్ కెమెరా ద్వారా వీడియోలు తీసిన ఘటన స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. జహంగీరాబాద్‌కు చెందిన ఒక యువకుడు తన భార్యను పరీక్షల నిమిత్తం మాల్వియా నగర్ ఎంఆర్‌ఐ సెంటర్‌కు తీసుకెళ్లాడు. పరీక్షకు ముందు, సిబ్బంది ఆమెను…
గుడ్లవల్లేరు కాలేజ్ ఘటనపై ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. ఆడపిల్లల జీవితాలతో ముడిపడిన అంశంపై క్లారిటీ ఇవ్వడానికి ఎన్ని రోజులు కావాలని అడిగారు. సీరియస్‌గా తీసుకోకపోతే ఇదో అలవాటుగా మారిపోతుందన్నారు.
వైసీపీలో ఇమడలేక చాలా మంది మా వైపు వస్తామంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని మీడియా చిట్‌చాట్‌లో ఆయన తెలిపారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయన్నారు.
కృష్ణా జిల్లా గడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్‌లో రహస్య కెమెరాలు పెట్టారనే అంశంపై జరుగుతున్న విచారణను సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఉదయం ఘటన విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులను, మంత్రి కొల్లు రవీంద్రను, జిల్లా ఎమ్మెల్యేలను కళాశాలకు వెళ్లాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. ఉదయం నుంచి అక్కడ జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తెలుసుకున్నారు.