ఈ మధ్య ‘ఎఫ్.ఐ.ఆర్.’ సినిమాతో సందడి చేసిన తమిళ హీరో విష్ణు విశాల్ ‘మట్టి కుస్తీ’ చేయబోతున్నాడు. ఈ తాజా చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ విడుదలయింది. మంగళవాయిద్యాలతో శుభకరంగా ఈ పిక్ మొదలవుతుంది. ‘వీరా వెడ్స్ కీర్తి’ అనీ కనిపిస్తుంది. ఓ వైపు పెళ్ళితంతు, మరోవైపు కుస్తీ పోరుకు సంబంధించిన ఇమేజెస్. చివరలో ‘మట్టి కుస్తీ’ టైటిల్ దర్శనమిస్తుంది. ‘ఎఫ్.ఐ.ఆర్.’ చిత్రానికి మాస్ మహారాజా రవితేజ సమర్పకునిగా వ్యవహరించారు. ఈ సినిమాకు కూడా రవితేజ సమర్పకుడు…