కొంతమందికి నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు సినిమా టైటిల్స్ భలేగా అచ్చి వస్తాయి. మహేశ్ బాబుకు అక్కినేని పాత సినిమా టైటిల్స్ ‘యువరాజు, శ్రీమంతుడు’ కలసి వచ్చాయి. అదే తీరున నాటి స్టార్ కమెడియన్ సునీల్ కూడా ‘అందాల రాముడు’, ‘పూలరంగడు’ వంటి ఏయన్నార్ సినిమా టైటిల్స్ తో గ్రాండ్ సక్సెస్ పట్టేశారు. ‘అందాలరాముడు’తో హీరోగా సక్సెస్ చూశారు సునీల్. తరువాత కొన్ని సినిమాల్లో హీరో స్థాయి పాత్రలు ధరించారు. ఆ పై రాజమౌళి ‘మర్యాద రామన్న’తో బంపర్…
యండమూరి వీరేంద్రనాథ్ రచనలను విపరీతంగా ఇష్టపడిన పాఠకులు ఒకప్పుడు బాగా ఉండేవారు. తరం మారగానే యండమూరి కాల్పనిక సాహిత్యానికి తిలోదకాలిచ్చి పర్సనాలిటీ డెవలప్ మెంట్ రచనల వైపు మళ్ళారు. రచయితగా గొప్ప గుర్తింపు తెచ్చుకున్న ఆయన దర్శకుడిగా మాత్రం విజయాన్ని అందుకోలేకపోయారు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా మరోసారి మెగా ఫోన్ పట్టుకుని ‘అతడు ఆమె ప్రియుడు’ చిత్రాన్ని తెరకెక్కించారు. రామ్ తుమ్మలపల్లి, రవి కనగాల నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. రవి (బెనర్జీ) ఓ ఆస్ట్రానోమర్.…