సంక్రాంతి బరి నుండి ‘ట్రిపుల్ ఆర్’ మూవీ తప్పుకోవడం కాదు గానీ… చిన్న చిత్రాల నిర్మాతలకు అది జాక్ పాట్ గా మారింది. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో తమ చిత్రాలను విడుదల చేసుకోవడం కష్టం అని భావించిన చాలామంది చిన్న చిత్రాల నిర్మాతలు ఇప్పుడు సంక్రాంతి సీజన్ ను క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ సిద్ధు జొన్నలగడ్డతో తీసిన ‘డిజె టిల్లు’ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేస్తామని…