దేశవ్యాప్తంగా విషాదం నింపిన హెలికాప్టర్ ప్రమాదానికి పొగమంచే కారణమని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడురోజుల నుంచి ఈ మార్గంలో ట్రయల్ రన్ నడుస్తోంది. సంజప్పన్ క్షత్తిరం గ్రామంలో కాలిపోతూ కుప్పకూలింది మిలటరీ హెలికాప్టర్. బుధవారం మధ్యాహ్నం 12.20 నిమిషాలకు ఈ ఘటన చోటుచేసుకుంది. కాతేరీ పార్క్ లో ఈ హెలికాప్టర్ కుప్పకూలింది. నీలగిరి ప్రాంతంలో సాధారణంగా పొగమంచు ఎక్కువగా వుంటుంది. దీంతో హెలికాప్టర్ ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. స్థానికులు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. కాసేపట్లో వెల్లింగ్…
తమిళనాడులోని కూనూరు సమీపంలో జరిగిన ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటన పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో మరణించిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి, ఆర్మీ అధికారులకు సంతాపం వ్యక్తం చేశారు బండి సంజయ్. మాతృభూమి రక్షణ కోసం రావత్ చేసిన సేవలు ఎనలేనివన్నారు బండి సంజయ్. రావత్ మరణం దేశానికి తీరని లోటన్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు…
తమిళనాడులో ఘోర ప్రమాదం సంభవించింది. భారత ఆర్మీ చీఫ్ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆర్మీ చీఫ్ తో పాటు 13 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన వారిలో చిత్తూరు జిల్లా కురబలకోటకు చెందిన జవాను సాయితేజ్ ఉన్నట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. తమిళనాడు లోని కూనూరు సమీపంలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా విషాదాన్ని నింపింది. హెలీకాప్టర్ లో 14 మంది ప్రయాణిస్తున్నారు. ఇందులో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఇండియన్…
తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంతాపం ప్రకటించారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్య, మరో 11 మంది సాయుధ బలగాల ఆకస్మిక మరణం తీవ్ర వేదనకు గురిచేసింది అన్నారు. ఆయన అకాల మరణం మన సైనిక బలగాలకు, దేశానికి తీరని లోటు. జనరల్ రావత్ అసాధారణమైన ధైర్యం, శ్రద్ధతో దేశానికి సేవ చేశారు. మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా రావత్ మన…
Mi-17 V5 హెలికాఫ్టర్ కు అనేక ప్రత్యేకతలు వున్నాయి. ఇది చాలా అత్యాధునిక ఎయిర్ క్రాఫ్ట్. టెక్నాలజీ పరంగా కూడా ఎలాంటి కొరత ఉండదు. ఇలాంటి ఉన్నతాధికారులు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎన్నో భద్రతా చర్యలు తీసుకుంటారు. ఏ రూట్ లో అయితే ట్రావెల్ చేయాలో… ఏ పైలెట్ అయితే వెళ్తాడో ముందుగానే అక్కడికి వెళ్లి ల్యాండ్ చేసి… కంప్లీట్ రిపోర్ట్ ఇస్తాడంటున్నారు రిటైర్డ్ మేజర్ భరత్. ట్రయల్ ల్యాండింగ్ మస్ట్ గా చేస్తారు. కేటగిరి బీ పైలెట్స్…
సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూలిన ఘటన దేశవ్యాప్తంగా విషాదం నింపింది. ఈ ప్రమాదం జరిగే సమయంలో అక్కడ వున్న ప్రత్యక్ష సాక్షి అసలేం జరిగిందో వివరించే ప్రయత్నం చేశారు. హెలికాప్టర్ కూలే సమయంలో భారీ శబ్దం వచ్చింది. వెంటనే వెళ్ళి అక్కడ చూస్తే భారీ మంటలతో కూడిన పొగ వచ్చింది. ఈ విషయాన్ని వెంటనే పోలీసులు కు చెప్పామన్నారు ప్రత్యక్ష సాక్షి. హెలికాప్టర్ కూలిన ప్రదేశం నుండి వంద మీటర్ల దూరంలోనే స్థానికులు ఉంటున్నారు.…
జమ్మూకశ్మీర్‌లో చోటుచేసుకున్న ఓ దుర్ఘటనలో ఇద్దరు జవాన్లు కన్నుమూశారు.. ఉధంపూర్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పట్నిటాప్ వద్ద కొండల్లో ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిపోయింది.. ఈ సమయంలో హెలికాప్టర్ లో ఉన్న ఇద్దరు పైలట్లు తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయజనం లేకుండా పోయింది.. అప్పటికే ఆ ఇద్దరు పైలట్లు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు పైలట్లు మేజర్ ర్యాంకువారు. ఉదయం 10.30 గంటల సమయంలో ఈ ప్రమాదం…