సీడీఎస్ బిపిన్ రావత్ ప్రమాదం పై హై లెవెల్ ఎంక్వైరీ కొనసాగుతోందన్నారు ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి. విచారణ కమిటీలో ఎయిర్ ఫోర్స్ కు చెందిన ఉన్నతాధికారులు ఉన్నారు. వాతావరణ తప్పిదమా.. మానవ తప్పిదమా.. లేక సాంకేతిక లోపమా అనేది విచారణ చేస్తున్నాం. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రమాదం పై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమన్నారు. హైదరాబాద్ దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో జరిగిన పాసింగ్ పరేడ్ కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్…
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ కూలిన దుర్ఘటన యావత్ దేశాన్ని కన్నీటిపర్యంతం చేసింది. 13 మంది ఈ ప్రమాదంలో కన్నుమూశారు. ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో తెలుగు బిడ్డ లాన్స్ నాయక్ హోదా సాయి తేజ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. సీడీఎస్ బిపిన్ రావత్‌కి వ్యక్తిగత భద్రతా సిబ్బందిలో ఒకరిగా సాయితేజ సేవలందిస్తున్నారు. తన బాస్ బిపిన్ రావత్ తో కలిసి వెల్లింగ్టన్ వెళుతున్న వేళ.. తన భార్య శ్యామలకు ఒక సందేశం పంపారు సాయితేజ. ”హ్యాపీగా ఉండు..…
తమిళనాడులో రెండు రోజుల క్రితం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంపై ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక ప్రకటన చేసింది. త్రివిధ దళాల అధికారులతో ఏర్పాటు చేసిన కమిటీ హెలికాప్టర్ ప్రమాదంపై విచారణ జరుపుతోందని IAF వెల్లడించింది. ప్రమాదానికి గల కారణాలు విచారణలో బయటకు వస్తాయని.. అప్పటివరకు ప్రమాదంపై ఎటువంటి ఊహాగానాలకు తావు ఇవ్వొద్దని కోరింది. దర్యాప్తు పూర్తయ్యేవరకు తప్పుడు ప్రచారం వద్దని.. ప్రాణాలు కోల్పోయిన వారి మర్యాదను మనం కాపాడాల్సిన అవసరం ఉందని IAF పేర్కొంది. Read Also: డీఎన్ఏ…
తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ అంత్యక్రియలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి. ఢిల్లీలోని కామరాజ్ మార్గ్‌లో ఉన్న బిపిన్ రావత్ ఇంటి వద్ద ఆయన మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనంతరం సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. బిపిన్ రావత్ సహా ఘటనలో మృతి చెందిన 13 మందికి దేశమంతా నివాళులు అర్పిస్తోంది. బిపిన్ రావత్ భౌతికకాయానికి ప్రధాని మోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర విమానయాన శాఖ…
నిన్న మధ్యాహ్నం సీడిఎస్ బిపిన్ రావత్ ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్ కూనూరు వద్ద కూలిపోయిన సంగతి తెలిసిందే. టీ ఎస్టేట్‌కు సమీపంలో కూలిపోవడంతో అందులో పనిచేస్తున్న కూలి శివ అనే వ్యక్తి వెంటనే అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. మంటల్లో కాలిపోతున్న ఓ వ్యక్తిని చూశానని, మంచినీళ్లు అడిగారని, అయితే, నీళ్లు ఇవ్వకుండా గుడ్డలో చుట్టి పైకి తీసుకెళ్లి ఆర్మీకి అప్పగించానని, మూడు గంటల తరువాత చనిపోయి ఆ వ్యక్తి బిపిన్ రావత్ అని, దేశానికి ఎంతో సేవచేసిన…
తమిళ నాడు రాష్ట్రంలో నిన్న మధ్యాహ్నం.. హెలికాప్టర్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘోర ప్రమాదంలో.. ఏకంగా.. బిపిన్ రావత్ దంపతులతో సహా.. 13 మంది మరణించారు. దీంతో దేశం విషాద ఛాయలోకి వెళ్లింది. అయితే.. తాజాగా హెలికాప్టర్ సంఘటనపై వివాదస్పద రాజ్య సభ సభ్యులు సుబ్ర మణ్య స్వామి ఆస్తకి కర వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై సుప్రీం కోర్టు రిటైర్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ”తమిళ నాడులోని కూనూర్ సమీపంలో జరిగిన…
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదం నింపింది. త్రివిధదళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ మరణం దురదృష్టకరం అన్నారు రక్షణ శాఖ కార్యదర్శి, భారత రక్షణ పరిశోధన, అభివృధ్ద సంస్థ ఛైర్మన్ డా.జి.సతీష్ రెడ్డి. జనరల్ రావత్ సుమారు 209 రక్షణ పరికరాలను స్వదేశీ పరిజ్ఞానం తో రూపొందించాలని ఓ జాబితా ను సిధ్దం చేశారు. త్రివిధ దళాలను సంఘటితం చేసి మరింత పటిష్టంగా రక్షణ దళ వ్యవస్థను సాంకేతికంగా అభివృధ్ది చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పం.…
హెలికాప్టర్ ప్రమాద స్థలంలో బ్లాక్ బాక్స్ లభ్యం అయింది. ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలకు ఈ బ్లాక్ బాక్స్ దొరికింది. ప్రమాద స్థలం నుంచి 30 అడుగుల దూరంలో బ్లాక్ బాక్స్ లభ్యమైనట్లు… ఢిల్లీ నుంచి వచ్చిన బృందాలు తెలిపాయి. దీంతో బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు ఆర్మీ అధికారులు. అనంతరం బ్లాక్ బాక్స్ ను విశ్లేషణ కోసం ఢిల్లీ బృందం ప్రమాద ఘటనా స్థలం నుంచి తీసుకు వెళ్ళింది. కాగా…తమిళ నాడు రాష్ట్రంలో నిన్న…
భారత్ ఓ నికార్సైన దేశభక్తుణ్ని కోల్పోయింది. దేశం కోసం నాలుగు దశాబ్దాలకు పైగా అనేక పోరాటాలు చేసిన వీరుణ్ని పోగొట్టుకుంది. చివరి రోజు వరకు విధినిర్వహణలోనే గడిపిన జనరల్ బిపిన్ రావత్ దేశానికి చేసిన సేవలు అసామాన్యం. 1978లో మొదలైన ఆయన కెరీర్ నేటివరకు అంచెలంచెలుగా ఎదగటంలో అకుంఠిత దీక్ష, అంతులేని క్రమశిక్షణ ఉన్నాయి. భారతదేశపు మొట్టమొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్. 2019 డిసెంబర్ 30నుంచి ఆయన ఈ పదవిలో ఉన్నారు.భారత్‌కు తొలి…