Heinrich Klaasen Test Retirement: దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినట్లు తెలిపాడు. తన రిటైర్మెంట్ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని 32 ఏళ్ల క్లాసెన్ చెప్పాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం చాలా కఠినమైందని, తన ఫేవరెట్ ఫార్మాట్ నుంచి అర్ధంతరంగా తప్పుకుంటున్నందుకు చాలా బాధగా ఉందని క్లాసెన్ పేర్కొన్నాడు. 2019 నుంచి 2023 మధ్య దక్షిణాఫ్రికా తరపున నాలుగు టెస్ట్ మ్యాచ్‌లు…