శుక్రవారం తెల్లవారుజామున అహ్మదాబాద్ ఆసుపత్రిలో ప్రధాని నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ ప్రాణాలు విడిచారు. ఈ నేపథ్యంలో ఆమె మృతి పట్ల ప్రపంచ నేతలు సంతాపం వ్యక్తం చేశారు.
ప్రధాని నరేంద్రమోదీ మాతృమూర్తి హీరాబెన్ మోదీ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రధాని మోదీ అశ్రునయనాలతో తన తల్లి పాడె మోశారు. అంతిమ యాత్ర వాహనంలో తల్లి పార్థివ దేహం వద్ద కూర్చుని ప్రధాని భావోద్వేగానికి గురయ్యారు.