Rain Alert In Telugu States: నేడు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది.. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనావేసింది. ఉత్తర ఒడిశా తీరం సమీపంలో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణశాఖ వెల్లడిచింది. దీని ప్రభావంతో రానున్న 24గంటల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటన విడుదల చేసింది. శనివారం, ఆదివారం 15 జిల్లాల్లో బలమైన గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్…
బిపర్‌జోయ్ తుఫాన్ మరో 2 గంటల్లో బలహీనపడుతుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తుఫాన్ శుక్రవారం రాత్రి 11:30 గంటలకు ఆగ్నేయ పాకిస్థాన్ మీదుగా డీప్ డిప్రెషన్ గా బలహీనపడింది.
తిరుపతి వర్షంతో వణికిపోతోంది. వరుణ దేవుడు తన ప్రతాపం చూపడంతో ఆధ్యాత్మిక క్షేత్రం అల్లాడిపోతోంది. ఎటు చూసినా వరదలే. జనం అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. తిరుపతిలోని మ్యూజియం పక్కనే వున్న ఏపీ టూరిజం హోటల్ వెనుక వైపున విరిగి పడ్డాయి కొండచరియలు. గోడకూలి ఇరుక్కుపోయారు వంట మాస్టర్, మరో మహిళ. ఇరువురిని కాపాడి ఆస్పత్రికి తరలించారు ఫైర్ సిబ్బంది. పీలేరు సమీపంలో అగ్రహారం చెరువు పూర్తిగా నిండడంతో చెరువు తెగే ప్రమాదం ఏర్పడింది. దిగువ భాగాన…