ఉమ్మడి కృష్ణాజిల్లాలో భారీ వర్షాల ఎఫెక్ట్ స్పష్టంగా కనపడుతోంది. జగ్గయ్యపేటలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వత్సవాయి, పెనుగంచిప్రోలు మండలాలలో వరి, పత్తి, పొలాలు నీట మునిగాయి. కూచి వాగు వరద ప్రవాహం ఎక్కువ ఉండటంతో పెనుగంచిప్రోలు నుండి తెలంగాణ మధిరకు రాకపోకలు నిలిచాయి.