Andhra Pradesh weather: ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విఫా తుఫాన్ అవశేషం కావడంతో బలపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. 7.5కి.మీ వరకు అల్పపీడనం వ్యాపించింది. ఛత్తీస్‌ఘడ్ మీదుగా ద్రోణి, మరో ఉపరితల ఆవర్తనం ఆవరించింది. వచ్చే రెండు రోజులు ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గరిష్టంగా 60కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి.…
Weather Updates : తెలంగాణకు వాతావరణ శాఖ శుభవార్త తెలిపింది. గత కొన్ని రోజులుగా వర్షాభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు, ఎండలు ఉక్కపోతతో చికాకుపడుతున్న ప్రజలకు ఇది కొంత ఊరటను కలిగించనుంది. రానున్న రెండు రోజులపాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 340 మండలాల్లో వర్షపాతం లోపం నమోదైన నేపథ్యంలో, ఈ వర్ష సూచన కొంత ఉపశమనం కలిగించనుంది. రేపు (గురువారం) నల్గొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ…
వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. కళింగపట్నంకి తూర్పున 280 కి.మీ., గోపాల్‌పూర్‌కి తూర్పు-ఆగ్నేయంగా 230 కి.మీ.,పారాదీప్ కి దక్షిణ-ఆగ్నేయంగా 260 కి.మీ , దిఘాకి దక్షిణంగా 390 కి.మీ దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది.
Moranchapally: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లికి రెండు ఆర్మీ హెలికాప్టర్లను పంపింది. మోరంచవాగు నీటిలో మునిగిన మోరంచపల్లి గ్రామం.
ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి.. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వానలు, చాలా చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఇంకా కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షలు పడుతున్నాయి. దీంతో, ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టాలంటేనే ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.. ఇక, భారీ వర్షాల దృష్ట్యా.. తెలంగాణ ప్రభుత్వం బుధవారం వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే, వాతావరణశాఖ తాజా ప్రకటన ప్రకారం.. తెలుగు రాష్ట్రాల్లో…