Heavy Rains: హైదరాబాద్ వాతావరణ కేంద్రం రాష్ట్ర ప్రజలకు కీలక హెచ్చరిక జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడి, ఈశాన్య దిశగా కదులుతున్న ‘మొంథా’ తుఫాన్ అర్ధరాత్రి తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. తీరాన్ని తాకే సమయంలో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ తుఫాన్ ప్రభావం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కనిపిస్తోంది. హైదరాబాద్ సహా అనేక జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి.
Heavy Rain: హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురుస్తోంది. ఈ సాయంత్రం నుంచి కుండపోత వర్షం కురుస్తుండటంతో నగరంలోని అనేక ప్రాంతాల్లో వరద నీరు రోడ్లపైకి చేరింది. ముఖ్యంగా మాదాపూర్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్‌పేట్ ప్రాంతాల్లో రోడ్లపైకి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.
Heavy Rain in Hyderabad: హైదరాబాద్‌లో ఇవాళ తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. నగరంలోని కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని సమాచారం.