నిన్న మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్యే మాటల తూటాలు పేలాయి. సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు సాగాయి. కట్ చేస్తే.. అనుచరులు సైతం ఫీల్డ్‌లోకి ఎంట్రీ ఇచ్చేశారు. ఏ శిబిరంపై ఈగ వాలినా రెండోపక్షం అస్సలు ఊరుకోవడం లేదట. ఇదే టెక్కలి రాజకీయాన్ని మరింత వేడెక్కిస్తోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. టెక్కలిలో వైసీపీ వర్సెస్ టీడీపీ! శ్రీకాకుళం జిల్లాలో రాజకీయమంతా ఇప్పుడు టెక్కలి చుట్టూనే తిరుగుతోంది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలో ఉన్నా.. టెక్కలి ఎమ్మెల్యేగా ఏపీ…