దీర్ఘకాలికంగా బీపీ, షుగర్‌లతో బాధపడేవాళ్లు నెలకోసారో, రెండు మూడు నెలలకోసారో పరీక్షలు చేయించుకుంటే ఫలితాలు సరిగ్గా రావు. డైలీ టెస్టులు చేయించుకుంటే డైట్‌ని పక్కాగా ఫాలో అవ్వొచ్చు. తద్వారా మరింత ఆరోగ్యంగా ఉండొచ్చు. అయితే చాలా మంది.. రక్త పరీక్షలు చేయించుకోవాలంటే భయపడతారు. సూదిని చూసి వణికిపోతారు. ఇలాంటివారి కోసం (నీడిల్ ఫోబియా ఉన్నోళ్ల కోసం) కొత్త పరికరం అందుబాటులోకి వచ్చింది. దాని పేరు “ఏవ”(EYVA). హైదరాబాద్‌కి చెందిన బ్లూసెమీ అనే సంస్థ ఈ డివైజ్‌ని రూపొందించింది.…