వైద్య సిబ్బంది పనివేళలు పాటించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి సత్యకుమార్ యాదవ్.. ప్రజారోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వ వైద్యులు, ఇతర సిబ్బంది నిర్ణీత పనివేళలు పాటించకపోవడంపై మండిపడ్డారు.. ఈ విషయంపై గురువారం సాయంత్రం మూడు గంటలకు పైగా మంత్రిత్వ శాఖలోని ఉన్నతాధికారులతో లోతుగా సమీక్షించారు. పనివేళల పట్ల నెలకొన్న క్రమశిక్షణా రాహిత్యం, దానిని అరికట్టేందుకు ప్రస్తుతం వివిధ స్థాయిల్లో చేపడుతున్న చర్యలు, పరిస్థితిని మెరుగుపర్చేందుకు మున్ముందు చేపట్టాల్సిన చర్యల గురించి వివరంగా చర్చించారు.