బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలు అందుబాటులో ఉన్నాయి.. విటమిన్-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. బొప్పాయి తరచుగా తింటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలసటను దూరం చేస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి…