Weight Loss : బొప్పాయిని ఇలా తీసుకుంటే బరువు తగ్గుతారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బొప్పాయి పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఎందుకంటే వీటిలో ఎన్నో రకాల పోషకాలు అందుబాటులో ఉన్నాయి.. విటమిన్-ఎ, బి, సి, ఇ, కెలతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. బొప్పాయి తరచుగా తింటే.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలసటను దూరం చేస్తుంది, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. బొప్పాయి తరచు తీసుకుంటే.. బరువు కూడా తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.. మరి బొప్పాయిని ఎలా తీసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
సాధారణంగా బొప్పాయిలో పపైన్, చైమోపాపైన్ ఉంటాయి. ఈ రెండూ జీర్ణక్రియకు, మలబద్ధకంతో పోరాడటానికి సహాయపడతాయి. ఇది కడుపులో పూత నివారణ, నయం చేయడానికి తోడ్పడతాయి. బరువు తగ్గడానికి, ఆరోగ్యకరమైన గట్, జీర్ణవ్యవస్థ చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు..
Also Read
- వనస్థలిపురంలో ఘనంగా ప్రారంభమైన CMR షాపింగ్ మాల్
- Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
- Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
ఈ పండులో పాపైన్ అనే యాంటీఆక్సిడెంట్ ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్.. బరోవు కోల్పోకుండా నిరోధించే అవకాశం ఉందని ఇటీవల జరిపిన పరిశోధన లో వెళ్లడయింది..
అత్యంత పోషకమైన పండు అదనపు కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్, లిపిడ్లను విచ్ఛిన్నం చేయడానికి, నిర్మూలించడానికి సహాయపడుతుంది. శరీరానికి పోషణను కూడా అందిస్తుంది..
కేలరీలు తక్కువగా ఉంటాయి. ప్రతి 100 గ్రాముల బొప్పాయిలో 43 కేలరీలు ఉంటాయి. అదనంగా, బొప్పాయిలో విటమిన్ సి, కాల్షియం, విటమిన్ ఎ, మెగ్నీషియం వంటివి వీటిలో అధికంగా ఉంటాయి..
కొంతమంది కడుపులో యాసిడ్ లు తక్కువగా ఉంటాయి.. అలాంటి వారికి, బొప్పాయిలో ఉండే పపైన్ సహాయం చేస్తుంది. ఇది మాంసాన్ని జీర్ణం చేయడానికి, మాంసం నుంచి వచ్చే ప్రొటీన్ గ్రహించడానికి సహాయపడుతుంది. కొవ్వును కరిగించడానికి, బరువు తగ్గడానికి ప్రొటీన్ తోడ్పడుతుంది.. రోజూ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు గుడ్ బై చెప్పొచ్చు.. అలాగే చర్మ సంరక్షణకు కూడా ఇది సహాయపడుతుంది… ఇన్ని ప్రయోజనాలు ఉన్న బొప్పాయిని మీ డైట్ లో చేర్చుకోండి ఆరోగ్యంగా ఉండండి..
నోట్ : ఇంటర్నెట్ లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వార్తను పబ్లిష్ చేస్తున్నాము. ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు ఎన్టీవీతెలుగు.కామ్ బాధ్యత వహించదు.
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..