బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో దారుణం చోటు చేసుకుంది. యూనిఫాం ధరించకుండ పాఠశాలకు వచ్చిన 6వ తరగతి విద్యార్థిని చితకబాదాడు హెడ్ మాస్టర్. తీవ్రంగా కొట్టడంతో వీపుపై పెద్దపెద్ద గాయాలయ్యాయి. ఈ ఘటనలో ప్రధానోపాధ్యాయుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటీవల కాలంలో స్కూల్స్ లో ఉపాధ్యాయుల తీరు ఆందోళనకరంగా మారుతోంది. విద్యార్థుల పట్ల వారు ప్రవర్తించే తీరు తల్లిదండ్రులకు భయాందోళనలకు గురిచేస్తుంది. విద్యార్థి తప్పు చేస్తే మందలించడం అనేది సాధారణం.. కానీ వారిని ఇష్టం వచ్చినట్లు చితకబాదడం అనేది తప్పు.. విద్యార్థులు చదవలేదనో, స్కూల్ కు రాలేదనో…ఇతరత్రా కారణాల వల్ల…వారిపై దాడులకు దిగుతున్నారు. విద్యార్థులను సరైన మార్గంలో పెట్టాలని విచిత్రమైన శిక్షలను విధిస్తూ ఉపాధ్యాయులు జైలు పాలవుతున్నారు. తాజాగా ఒక విద్యార్థిని భయపెట్టడానికి హెడ్ మాస్టర్ చేసిన…