HCU: ఢిల్లీ యూనివర్సిటీ తర్వాత, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికల్లో బీజేపీ విద్యార్థి సంఘం అయిన ‘‘అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ABVP)’’ జయకేతనం ఎగరేసింది. ఏబీవీపీ-ఎస్ఎల్వీడీ కూటమి అన్ని సెంట్రల్ ప్యానెల్ పోస్టుల్ని కైవసం చేసుకుంది. కూటమికి చెందిన శివ పాలెపు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఏబీవీపీ కూటమికి చెందిన శ్రుతి ప్రియ ప్రధాన కార్యదర్శి, సౌరభ్ శుక్లా సంయుక్త కార్యదర్శి పదవుల్ని గెలుచుకున్నారు.