తమ అభిమాన నేత పుట్టిన రోజును వైయస్ఆర్‌సీపీ శ్రేణులు పండగలా జరుపుకుంటున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీ, పవన్ కల్యాణ్, చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఆయనకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున కేక్‌లు కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువాళ్లు సైతం.. ఏపీ సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్‌లో #HBDYSJagan హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేశారు.