(జూన్ 25న మహానటి శారద పుట్టినరోజు) ఇప్పుడంటే జాతీయ స్థాయిలో నటనలో ఉత్తములుగా నిలిచిన వారిని ‘జాతీయ ఉత్తమనటుడు’, ‘జాతీయ ఉత్తమనటి’ అంటున్నాం. కానీ, ఆ రోజుల్లో జాతీయ స్థాయిలో ఉత్తమనటునికి ‘భరత్’ అని, ఉత్తమనటికి ‘ఊర్వశి’ అని అవార్డులు అందించేవారు. అలా మూడుసార్లు ‘ఊర్వశి’గా నిలిచిన నటీమణి శారద. 1967లో నటీమణులకు కూడా నేషనల్ అవార్డ్స్ ఇవ్వడం ఆరంభించారు. తొలి అవార్డును ‘రాత్ ఔర్ దిన్’ ద్వారా నర్గీస్ దత్ అందుకున్నారు. మరుసటి సంవత్సరమే అంటే…