(జూన్ 4న ప్రియమణి పుట్టినరోజు)తెలుగు చిత్రాలతోనే వెలుగు చూసిన కన్నడ కస్తూరి ప్రియమణి. అందం, అభినయం కలబోసుకున్న ప్రియమణి తెలుగునాట తకధిమితై తాళాలకు అనువుగా చిందులు వేసింది. కనువిందులు చేసింది. తమిళ చిత్రం ‘పరుతివీరన్’తో ఉత్తమనటిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్న ప్రియమణి, తన దరికి చేరిన ప్రతీపాత్రకూ న్యాయం చేయాలని తపించింది. దక్షిణాది నాలుగు భాషల్లోనే కాదు, ఉత్తరాదిన హిందీలోనూ ప్రియమణి అభినయం అలరించింది. అయితే ప్రియమణికి మాత్రం తెలుగు చిత్రాలతోనే అశేష ప్రేక్షకాభిమానం లభించిందని…