ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయమయిన ఉప్పలపాటి ప్రభాస్ రాజు సూపర్ హిట్ సినిమాలతో స్టార్ గా ఎదిగి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచపటంలో నిలబెట్టి కాలర్ ఎగరేసేలా చేసినా యంగ్ రెబల్ స్టార్ పుట్టిన రోజు కనుకగా పలువురు టాలీవుడ్ సెలెబ్రెటీలు డార్లింగ్ కు శుభాకాంక్షలు తెలియజేసారు. మెగాస్టార్ చిరంజీవి : ఆ కట్ అవుట్ చూసి అన్ని నమ్మేయాలి Dude!అతను ప్రేమించే పద్దతి చూసి, తిరిగి అమితంగా ప్రేమించేస్తాం. పుట్టినరోజు శుభాకాంక్షలు…
‘ఉప్పలపాటి ప్రభాస్’ ఈ ఒక్క పేరు బాక్సాఫీస్ తారకమంత్రమై ప్రపంచమంతటా మార్మోగుతోంది. తన సినిమాలతో టాలీవుడ్ పేరు ప్రపంచ సినిమాలో నిలబెట్టిన ఒకే ఒకడు రెబల్ స్టార్ హీరో ప్రభాస్. ఆయన నెంబర్ వన్ ఇండియన్ సూపర్ స్టార్ అని చెప్పేందుకు మాటలు కాదు ఆయన క్రియేట్ చేస్తున్న నెంబర్స్, రికార్డ్స్ తిరుగులేని నిదర్శనంగా నిలుస్తున్నాయి. ప్రభాస్ సినిమాల బాక్సాఫీస్ నెంబర్స్ ట్రేడ్ పరంగా ఒక స్కేలింగ్ అయితే ప్రభాస్ సినిమా వస్తుందంటే పిల్లల నుంచి పెద్దల…