(జూన్ 2న ఇళయరాజా బర్త్ డే)ఉన్నది సప్తస్వరాలే, వాటితో పలికే రాగాలెన్నో! ఉన్నది ఒక్కడే ఇళయరాజా, ఆయన పలికించిన మధురం ఎంతో! ఈ నానుడి తమిళనాటనే కాదు, తెలుగునేలపైనా విశేషంగా వినిపిస్తుంది. తన తరం సంగీత దర్శకుల్లో ఇళయరాజా లాగా అభిమానగణాలను సంపాదించిన వారు మరొకరు కానరారు. తెరపై ఇళయరాజా పేరు కనిపించగానే అభిమానుల ఆనందం అంబరమంటేది. దాదాపుగా స్టార్ హీరోల స్థాయిలో ఇళయరాజా పేరు మారుమోగి పోయింది. ఇక ఆయన సంగీతం సమకూర్చిన చిత్రాలతోనే ఎంతోమంది…