(సెప్టెంబర్ 7న భానుమతి జయంతి) సాటిలేని మేటి నటి భానుమతి రామకృష్ణ పేరు తలచుకోగానే ముందుగా ఆమె బహుముఖ ప్రజ్ఞ మన మదిలో మెదలుతుంది… నటిగా, గాయనిగా, నర్తకిగా, రచయిత్రిగా, దర్శకురాలిగా, సంగీత దర్శకురాలిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా భానుమతి సాగిన తీరు అనితర సాధ్యం… సెప్టెంబర్ 7న భానుమతి జయంతి… ఈ సందర్భంగా భానుమతి బహుముఖ ప్రజ్ఞను మననం చేసుకుందాం… నటిగానే కాదు గాయనిగానూ భానుమతి బాణీ విలక్షణమైనది… ఆమె గానం నిజంగానే తెలుగువారి మనసుల్లో…