బాలనటుడిగా కెరీర్ ప్రారంభించి, హీరోగా దూసుకుపోతున్న తేజా సజ్జ పుట్టిన రోజు ఇవాళ. ఈ సందర్భంగా అతనికి విషెస్ తెలియచేస్తూ, తేజా కెరీర్ ముచ్చట్లు తెలుసుకుందాం! బాలనటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న తేజా సజ్జ సమంత మూవీ ‘ఓ బేబీ’ లో యంగ్ హీరోగా నటించి, తొలి యత్నంలోనే చక్కని విజయాన్ని అందుకున్నాడు. సమంత, నాగశౌర్య, లక్ష్మీ, రావు రమేశ్, ప్రగతి వంటి సీనియర్స్ సమక్షంలో స్క్రీన్ షేర్ చేసుకోవడమే కాకుండా తనదైన నటనను వెండితెరపై ప్రదర్శించాడు…