(జూన్ 13న రమణ గోగుల పుట్టినరోజు)కొంతమందికి వృత్తి కంటే ప్రవృత్తిపైనే ఎక్కువ మక్కువ ఉంటుంది. సంగీత దర్శకుడు రమణ గోగుల కూడా అదే బాటలో పయనించారు. తాను ఏ తీరున సాగినా, అందులో తనదైన బాణీ పలికించడం రమణ గోగులకు ఎంతో ఇష్టం. చదువులో మేటి అయిన రమణ గోగుల ఖరగ్ పూర్ ఐఐటీ నుండి ఎమ్.టెక్, మెకానికల్ ఇంజనీరింగ్ పట్టా పొందారు. అంతటితో ఆగకుండా లూసియానా యూనివర్సిటీలో ఎమ్.ఎస్., కూడా చేశారు. “లిక్విడ్ క్రిస్టల్, ఎర్తెన్…