(మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు)నితిన్ చిత్రసీమలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు కావొస్తోంది. అయినా ఇప్పటికీ లవర్ బోయ్ ఇమేజ్ తోనే సాగడం విశేషం. పాత్రకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు తనను తాను మార్చుకుంటున్నారు నితిన్.అదే నితిన్ బాణీ అని చెప్పవచ్చు. నిజానికి ఇన్నేళ్ళలో నితిన్ ను విజయాలకంటే పరాజయాలే ఎక్కువగా పలకరించాయి. అయినా పట్టువదలని విక్రమార్కునిలా ముందుకు సాగుతూనే ఉన్నారు. ఆరంభంలోనే వరుస విజయాలు చవిచూసిన నితిన్ కు ఆ తరువాత సక్సెస్ దూరంగా జరిగింది.…