వైవిధ్యానికి మారుపేరుగా నిలిచారు ప్రముఖ దర్శకుడు భారతీరాజా. ఒకప్పుడు భారతీరాజా సినిమా వస్తోందంటే చాలు వైవిధ్యానికి జై కొట్టేవారందరూ థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. వారి అభిరుచికి తగ్గట్టుగానే భారతీరాజా సినిమాలు రూపొందేవి. దర్శకునిగానే కాదు, నటునిగానూ కొన్ని చిత్రాలలో అలరించారు భారతీరాజా. భారతీరాజా అసలు పేరు చిన్నస్వామి. ఆయన 1941 జూలై 17న తమిళనాడులోని తేని అల్లినగరంలో జన్మించారు. బాల్యం నుంచీ భారతీరాజా కళల పట్ల ఆకర్షితుడై సినిమా రంగంలో తన ఉనికిని చాటుకోవాలని తపించేవారు.…