వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన జగన్ మొదటిసారి 2009లో కడప పార్లమెంట్ నియోజక వర్గం నుంచి పోటీచేసి విజయం సాధించారు. అయితే, 2009 సెప్టెంబర్ 2 వ తేదీన వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత వైఎస్ జగన్ ఒదార్పు యాత్ర చేసేందుకు సంకల్పించారు. కాంగ్రెస్ పార్టీ అందుకు అనుమతించకపోవడంతో విభేదించి 2011, మార్చి 11 వ తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో…