(నేడు ‘తల’ అజిత్ పుట్టిన రోజు)హైదరాబాద్ లో పుట్టి పెరిగిన అజిత్ ఇవాళ తమిళనాడులో స్టార్ హీరో! రజనీకాంత్, కమల్ హాసన్ తర్వాత ఆ స్థాయిలో ఫాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో అజిత్, విజయ్ నువ్వా- నేనా అన్నట్టుగా సాగుతున్నారు. మే 1 అజిత్ పుట్టిన రోజు. తమిళులు ‘తలా’ అని ప్రేమగా పిలుచుకునే అజిత్ కెరీర్ ప్రారంభంలోనే తెలుగు సినిమా ‘ప్రేమపుస్తకం’లో నటించడం విశేషం. అదీ గొల్లపూడి మారుతీరావు తనయుడు శ్రీనివాస్ దర్శకత్వంలో! ఈ సినిమా…