ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద హవాలా రాకెట్ గుట్టు రట్టు అయ్యింది… బంగారం స్మగ్లింగ్, జీఎస్టీ ఎగవేతే లక్ష్యంగా హవాలా లావాదేవీలు జరుగుతున్నట్టు చెబుతున్నారు అధికారులు.. ట్రావెల్స్ బస్సుల ద్వారా హవాలా సొమ్ము, బంగారం రవాణా చేస్తున్నారు.. ఇవాళ ఉభయ గోదావరి జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో బయటపడ్డ సొమ్ముతో అధికారులు నోరు వెల్లబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.. తూర్పు గోదావరి జిల్లా కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద పోలీసుల తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు పట్టబడటం కలకలం సృష్టించింది. ట్రావెల్స్…