దేశ రాజధాని ఢిల్లీలో వరదలకు కారణం హర్యానా ప్రభుత్వమేనని ఆప్ నేతలు ఆరోపించారు. ఢిల్లీ సర్కారును బదనాం చేయడానికే హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం హత్నీకుండ్ బ్యారేజ్ నుంచి నీటిని వదులుతోందని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపణలు చేశారు.
Hathinikund Barrage: రాజధాని ఢిల్లీ నిజంగానే వరదల్లో చిక్కుకుంటుందా? ప్రస్తుతం యమునా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యేలా కనిపించడం లేదు కాబట్టి ఢిల్లీ వాసుల గుండెల్లో ఈ ప్రశ్న తలెత్తుతోంది.