ఢిల్లీలో వరద ముప్పు ఇంకా కొనసాగుతుంది. హథినికుండ్ బ్యారేజీ నుంచి మరోసారి నీటిని విడుదల చేయడంతో యమునా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉంది. బ్యారేజీ నుంచి విడుదల చేసిన నీరు రేపు సాయంత్రానికి ఢిల్లీకి చేరుకుంటుందని.. ఈ సందర్భంలో యమునా నీటిమట్టం 206.70 మీటర్లకు చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
Hathinikund Barrage: రాజధాని ఢిల్లీ నిజంగానే వరదల్లో చిక్కుకుంటుందా? ప్రస్తుతం యమునా నదికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యేలా కనిపించడం లేదు కాబట్టి ఢిల్లీ వాసుల గుండెల్లో ఈ ప్రశ్న తలెత్తుతోంది.