Toll fee: టోల్ ఫీజు ఎగ్గొట్టడానికి ఓ బస్సు డ్రైవర్ దారుణానికి పాల్పడ్డాడు. టోల్ ప్లాజాలో ఆపకుండా వేగంగా బస్సుని నడిపాడు. బస్సుని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టోల్ సిబ్బందిలో ఒకరిని బస్సుతో తొక్కించాడు. దీనికి సంబంధించిన విజువల్స్ అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన హర్యానాలోని గురుగ్రామ్‌లోని ఘమ్రోజ్ ప్లాజా వద్ద జరిగింది. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే హర్యానా రోడ్ వేస్ బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Read Also:…