హర్యానా అసెంబ్లీ ఎన్నికల ట్రెండ్స్‌లో కాంగ్రెస్ ఓటమి పాలైంది. ఓటింగ్ ముగిసిన తర్వాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్.. కౌంటింగ్ రోజు భిన్నమైన ఫలితాలు రావడంతో కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈసారి అధికారంలో మార్పు వస్తుందని ఆ పార్టీ పూర్తి ఆశలు పెట్టుకుంది కానీ అది జరగలేదు. ఇలా ఎందుకు జరిగిందో అని ఎన్నికల విశ్లేషకులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. కాంగ్రెస్ ఓటమికి ఈ అంశాలు ప్రముఖంగా నిలిచాయి.
Haryana Elections 2024: హర్యానా ప్రజలు ఇప్పటి వరకు వరుసగా మూడోసారి ఎవరికీ పట్టం కట్టిన చరిత్ర లేదు.. గరిష్టంగా రెండుసార్లే ఒక పార్టీకి అధికారం అప్పజెప్పారు. 1968,72లో, 2005,09లో కాంగ్రెస్ ను గెలిపించగా.. 2014, 19లో బీజేపీకి అధికారం అందించారు.. ఈసారి హర్యానాలో హ్యాట్రిక్ కొట్టాలని బీజేపీ ప్లాన్ చేసింది . కానీ అందుకు విరుద్ధంగా ఎగ్జిట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ నేపథ్యంలోనే నేడు మొదలైన ఓట్ల లెక్కింపులో కూడా ఆ మార్క్ స్పష్టంగా కనపడుతోంది.…